What is Term Insurance Benefits, Types & Examples టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? – Complete Guide

Term Insurance అంటే ఏమిటి? పూర్తి వివరణ మరియు ప్రయోజనాలు 

Term Insurance – టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమాలో అత్యంత సులభమైన మరియు ఎక్కువగా ఉపయోగించే రక్షణ ప్లాన్. ఒక వ్యక్తి నిర్దిష్ట కాలానికి (Term) ప్రీమియం చెల్లిస్తాడు, ఆకాలంలో ఎలాంటి అనర్ఘటన జరిగితే ( మరణం) పాలసీదారుడి మరణం తర్వాత నామినీకి అందే భారీ బీమా మొత్తం ( Sum Assured) అందుతుంది. మీరు లేనప్పుడు కూడా కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగిఉంటుంది. మీ కుటుంబానికి రక్షణక కవచం లా పని చేస్తుంథి, మీ కుటుంబానికి మంచి ఆర్థిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరేషన్ అనేథీ చాలా మంచినిర్ణయం

Term Insurance ఇది ప్యూర్ లైఫ్ కవర్ — ఎలాంటి మెచ్యూరిటీ amount ఉండదు. 

SIP అంటే ఏమిటి? మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి సులభమైన గైడ్ – What is SIP? A Simple Guide for First-Time Investors.

1. Term Insurance ఎలా పనిచేస్తుంది? (How Does Term Insurance Works) 

1 Crore Coverage

టర్మ్ ఇన్సూరెన్స్‌లో మీరు నిర్ణయించిన కాలం ( ఉదా: 20 లేదా 30 సంవత్సరాలు) పాటు ప్రతి నెల లేదా సంవత్సరానికి ప్రీమియం చెల్లిస్తారు. ఆ పాలసీ కాలంలో పాలసీదారుడు అనుకోకుండా మరణిస్తే, పాలసీలో నిర్ణయించిన బీమా మొత్తం( Sum Assured) నామినీకి ఒకేసారి లేదా ఎంపిక చేసిన విధానంలో చెల్లించబడుతుంది. పాలసీ కాలం పూర్తయ్యే వరకు ఎలాంటి క్లెయిమ్ జరగకపోతే, సాధారణంగా ఎటువంటి మొత్తం తిరిగి రాదు. దీని ప్రధాన ఉద్దేశ్యం కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం. 

✔ Step- by- Step Process 

  1. మీరు ఒక పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్‌ ఎంచుకుంటారు ( ఉదా 10, 20, 30, 40 సంవత్సరాలు). 
  1. హామీ మొత్తం( Sum Assured) నిర్ణయిస్తారు ( ఉదా ₹ 50 లక్షలు / ₹ 1 కోటి / ₹ 2 కోట్లు). 
  1. Every year/ half- year/ monthlyగా ప్రీమియం చెల్లిస్తారు. 
  1. పాలసీ కాలంలో మీకు ఏదైనా అపార్థం జరిగితే
    👉  మీ కుటుంబానికి Sum Assured పూర్తిగా లభిస్తుంది.  
  1. పాలసీ term పూర్తయితే —
    👉 మేచ్యూరిటీ లాభం ఉండదు ( Unless you choose Return of Premium).

2. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? (Why Do You Need Term Insurance?) 

Term Insurance

టర్మ్ ఇన్సూరెన్స్ మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. తక్కువ ప్రీమియంతో భారీ బీమా రక్షణ లభించడం దీని ప్రధాన లాభం. ఇల్లు రుణం, పిల్లల విద్య, రోజువారీ ఖర్చులు వంటి బాధ్యతలు కుటుంబంపై పడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో నామినీకి గ్యారెంటీ బీమా మొత్తం అందడం వల్ల కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. 

  • కుటుంబానికి ఆర్థిక రక్షణ 
  • పిల్లల చదువు, హోమ్ లోన్, పెళ్లి వంటి future ఆర్థిక భారం తగ్గుతుంది 
  • భార్యాభర్తలకు మనశ్శాంతి (peace of mind) 
  • తక్కువ ప్రీమియంలో భారీ కవరేజ్ లభ్యం 
  • జీవితంలో uncertainties నుంచి protection 

ఉదా: మీ వయస్సు 30 సంవత్సరాలు అని అనుకుందాం. మీరు ఆరోగ్యంగా ఉంటే, టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఏటా కేవలం ₹ 10,000 – ₹ 12,000 ప్రీమియం చెల్లించడం ద్వారా ₹ 1 కోటి బీమా కవరేజ్ పొందవచ్చు. అంటే, పాలసీ కాలంలో అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా జరిగితే, మీ నామినీకి ₹ 1 కోటి వరకు బీమా మొత్తం లభిస్తుంది. తక్కువ ఖర్చుతో కుటుంబానికి పెద్ద ఆర్థిక భద్రత కల్పించే సులభమైన మార్గం ఇదే. 

3. టర్మ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు( Key Features) 

Key Features

టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో భారీ బీమా కవరేజ్ అందిస్తుంది. మీరు ఎంచుకున్న పాలసీ కాలంలో అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, నామినీకి గ్యారెంటీ బీమా మొత్తం లభిస్తుంది. పాలసీ కాలం, ప్రీమియం చెల్లింపు విధానం, బీమా మొత్తం అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. అదనంగా రైడర్లు మరియు పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. 

✔ High Sum Assured at Low Premium 
 Other life insurance plans‌తో పోలిస్తే చాలా తక్కువ ప్రీమియంతో పెద్ద కవరేజ్. 
 
✔ Pure Protection Plan 
 కొనుగోలు చేసిన ప్లాన్ పూర్తిగా జీవన భద్రత కోసం మాత్రమే. 
 
✔ Fixed Premium 

 పాలసీ పూర్తయ్యే వరకు ప్రీమియం మారదు. 

✔ Multiple payout options 
Lump Sum 
Yearly income 
Combination of both 

✔ Add – on Riders 
Accidental Death Benefit 
Critical Illness 
Premium Waiver Benefit 
Disability Rider 

4. టర్మ్ ఇన్సూరెన్స్ రకాలు( Types of Term Insurance) 

 Types

టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా లెవల్ టర్మ్ ప్లాన్, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, ఇన్‌కమ్ టర్మ్ ప్లాన్ మరియు జాయింట్ టర్మ్ ప్లాన్‌లు ఉంటాయి. లెవల్ టర్మ్ ప్లాన్‌లో మొత్తం కాలం పాటు ఒకే బీమా కవరేజ్ ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లో పాలసీ కాలం పూర్తయితే చెల్లించిన ప్రీమియం తిరిగి లభిస్తుంది. ఇన్‌కమ్ టర్మ్ ప్లాన్‌లో నామినీకి నెలవారీ ఆదాయం లభిస్తే, జాయింట్ టర్మ్ ప్లాన్‌లో దంపతులకు కలిపి బీమా రక్షణ అందుతుంది. 

ఉదాహరణ: 

1) Level Term Plan 
 
Sum Assured మొత్తం పాలసీ మొత్తం కాలంలో ఒకే రీతిగా ఉంటుంది. 
👉 మొత్తం ఎక్కువగా కొనేవారు ఇదే. 
 
2) Increasing Term Plan 

 
ప్రతి సంవత్సరం Sum Assured పెరుగుతూ ఉంటుంది. 
👉 Inflation protection. 
 
3) Decreasing Term Plan 

 
Sum Assured ప్రతి సంవత్సరం తగ్గుతుంది. 
👉 Loan protection కోసం. 
 
4) Return of Premium (ROP) Term Plan 
 
పాలసీ maturity అయితే మీరు చెల్లించిన premium తిరిగి వస్తుంది. 
👉 మేచ్యూరిటీ లాభం కావాలనుకునేవారికి. 

5. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు( Advantages) 

Advantages

1. కుటుంబానికి ఆర్థిక భరోసా 
 
Earner లేకున్నా మీ కుటుంబానికి జీవితం కొనసాగడానికి సహాయం. 
 
2. తక్కువ ఖర్చుతో భారీ కవరేజ్ 
 
Normal life insurance policy కన్నా చాలా తక్కువ premium. 
 
3. Tax Benefits ( Section 80C & 10 ( 10D)) 
 
ప్రీమియంపై 80C deductions 
నామినీకి వచ్చే amount tax-free 

4. Loan Responsibility Coverage 
 
మీ absenceలో కూడా లోన్లు మీ కుటుంబాన్ని బాధించవు. 
 
5. Peace of Mind for the Future 
 
మీరు లేకున్నా కుటుంబం కష్టాల్లో పడకూడదన్న భద్రత. 

6. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం? (Who Should Buy It?) 

Should Buy It

మీ కుటుంబం మీ ఆదాయంపై ఆధారపడి ఉంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. ముఖ్యంగా పిల్లలు, లోన్‌లు, రోజువారీ ఖర్చులు ఉన్నవారు, అలాగే తక్కువ ఖర్చుతో భారీ బీమా రక్షణ కోరుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. కొత్తగా ఉద్యోగం ప్రారంభించిన యువతకు కూడా ఇది మంచి ఆర్థిక భద్రతను అందిస్తుంది. 

✔ ఉద్యోగం చేస్తున్నవారికి 
✔ కుటుంబానికి ఏకైక ఆదాయం ఉన్నవారికి 
✔ లోన్ తీసుకున్నవారికి 
✔ చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు 
✔ బిజినెస్ చేయువారికి 
✔ 25 – 45 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ప్రతి వ్యక్తికి 

7. ఎంత కవరేజ్ తీసుకోవాలి? (How important Coverage Do You Need?) 

 Important Coverage

మీ వార్షిక ఆదాయాన్ని, కుటుంబ ఖర్చులు, లోన్‌లు, పిల్లల చదువు ఖర్చులను పరిగణలోకి తీసుకుని, కనీసం 10 – 15 రెట్లు ఆదాయానికి సమానం అయిన బీమా కవరేజ్ ఎంచుకోవాలి. ఇది కుటుంబ భద్రతకు సరిపడే మొత్తంగా ఉంటుంది. 

General thumb rule 
 
Annual Income × 10 – 20 
 
Example:
మీ Salery = ₹ 6 lakhs / per year 
అయితే Coverage = ₹ 60 lakhs – ₹ 1.2 crore 

8. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు చెక్ చేయాల్సినవి 

Claim settlement rate

✔ Claim settlement rate (CSR) 
 
ఎక్కువగా ఉన్న కంపెనీని ఎంచుకోండి (95% + is best). 
 
Premium amount
 
మీకు లాంగ్‌టర్మ్‌కి match అయ్యేలా చూసుకోవాలి. 
 
Riders అవసరమైతే మాత్రమే జత చేయండి 
 
అవసరం లేకుండా జోడిస్తే premium పెరుగుతుంది. 
 
✔ Buy Online → Cheaper and Faster 
 
Online plans ఎక్కువగా cost-effective. 

9. టర్మ్ ఇన్సూరెన్స్ Example (Realistic Case Study) 

Realistic Case Study

Girish, age 30 

Salary: ₹ 40,000 per month 
Family: Wife and 1 child 
Coverage Needed:  40,000 × 120 months = ₹ 48 lakhs ≈ ₹ 50 lakhs to ₹ 1 crore 

Premium 
₹ 1 crore term insurance → approx. ₹ 850 – ₹ 1,000 per month only. Start low amount for young age, increasing amount significantly by age.

సారాంశం (Conclusion) 

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ప్రీమియంలో కుటుంబానికి భారీ రక్షణను ఇచ్చె అత్యంత ముఖ్యమైన బీమా. ప్రతి ఆర్థికంగా బాధ్యత ఉన్న వ్యక్తి ఒక term plan తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మీ కుటుంబానికి భవిష్యత్తులో సురక్షితమైన ఆర్థిక గోడలా పని చేస్తుంది. 

👉 సింపుల్‌గా చెప్పాలంటే: మీపై ఎవరో ఒకరు ఆర్థికంగా ఆధారపడి ఉంటే, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. 

ఉదాహరణ: 
 
గిరీశ్, 30 ఏళ్ల వ్యక్తిగా, తన భార్య మరియు 1 పిల్లకు ఆర్థిక భద్రత కోసం 20 సంవత్సరాల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అతని వార్షిక ఆదాయం ₹ 40,000 నెలవారీగా ఉండగా, కుటుంబ అవసరాలు, లోన్‌లు, పిల్లల చదువు ఖర్చులు లెక్కలోకి తీసుకొని ₹ 50 లక్షల నుండి ₹ 1 కోటి వరకు కవరేజ్ ఎంచుకున్నాడు. ఈ పాలసీ ద్వారా, అనుకోని పరిస్థితుల్లో అతని కుటుంబం పెద్ద ఆర్థిక భారం నుంచి రక్షితమవుతుంది, మరియు వారి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. 

FAQ – తరచూ అడిగే ప్రశ్నలు  

Q1: టర్మ్ ఇన్సూరెన్స్‌లో మేచ్యూరిటీ అమౌంట్ ఉంటుందా?  

జ: సాధారణ టర్మ్ ప్లాన్‌లో మేచ్యూరిటీ అమౌంట్ ఉండదు. అయితే Return of Premium ప్లాన్స్‌లో ప్రీమియం తిరిగి లభిస్తుంది.  

Q2: టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి?  

జ: వీలైనంత త్వరగా, ముఖ్యంగా 20 – 30 ఏళ్ల వయస్సులో తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.  

Q3: ఒకటి కంటే ఎక్కువ టర్మ్ ప్లాన్లు తీసుకోవచ్చా?  

జ: అవును, అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు.  

Q4: టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉందా?  

జ: అవును, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రీమియంపై పన్ను మినహాయింపులు లభిస్తాయి.  

Q5: టర్మ్ ఇన్సూరెన్స్‌కు మేచ్యూరిటీ మనీ వస్తుందా?  

➡ No(unless ROP plan).  

Q6: Claim reject అవ్వడానికి కారణాలు?  

Health infoని తప్పుగా ఇచ్చడం  

Smoking/ drinking గురించి hide చేయడం  

Premium miss చేయడం  

Q7: ఏ వయస్సులో కొనాలి?  

➡ 21 – 35 years = smallest premium. 

చిన్న డబ్బు → పెద్ద లాభం: మ్యూచువల్ ఫండ్ పని విధానం Small Money → Big Profit How Mutual Funds Work

What is Mutual Funds – మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి – బిగినర్స్ కోసం పూర్తి గైడ్ (A Complete Guide for Beginners).

Disclaimer: Investments are subject to market risks. This content is for educational purposes only.

author avatar
GIRIBABU Founder & Personal Finance Writer
Giribabu is the founder of Paisa Margam, sharing simple insights on mutual funds, SIPs, insurance, and personal finance for beginners.

Leave a Comment