Mutual Fund Types మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి చేసే ఆస్తుల ఆధారంగా, రిస్క్ స్థాయి ఆధారంగా, పెట్టుబడి సమయానికి అనుగుణంగా పలు రకాలుగా ఉంటాయి. మీ పెట్టుబడి లక్ష్యం ఏంటి? రిస్క్ ఎంత తీసుకోగలరు? పెట్టుబడి కాలం ఎంత? వీటిని బట్టి ఫండ్‌ని ఎంచుకోవాలి. ఈ ఫండ్స్ వివిధ రకాలుగా విభజించబడతాయి, ప్రతి ఒక్కటి తమ ప్రత్యేక లక్ష్యాలు, వ్యూహాలు, మరియు పెట్టుబడి విధానాలతో కూడుకున్నవి. క్రింద వాటి వివరణ ఇవ్వబడింది.
మ్యూచువల్ ఫండ్స్ రకాలు
- Equity Mutual Funds – ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
- Debt Mutual Funds – బాండ్ మ్యూచువల్ ఫండ్స్
- Hybrid Mutual Funds – మిక్స్డ్ మ్యూచువల్ ఫండ్స్
- Index Mutual Funds – ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్
- ELSS Mutual Funds – ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్
- Liquid Mutual Funds – లిక్విడ్ ఫండ్స్
- Sectoral Mutual Funds – సెక్టార్ ఫండ్స్
- International Mutual Funds – అంతర్జాతీయ మార్కెట్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి – బిగినర్స్ కోసం పూర్తి గైడ్ (A Complete Guide for Beginners)
1. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – Equity Funds
ఈ రకం ఫండ్స్ ప్రధానంగా షేర్లలో పెట్టుబడి చేస్తాయి. రిస్క్ ఎక్కువ కానీ లాంగ్ టర్మ్‌లో అధిక రిటర్న్స్ ఇస్తాయి. 5 నుండి10+ సంవత్సరాల లక్ష్యాలకు సరైన ఎంపిక. Large/Mid/Small Cap Fund రకాలు ఉంటాయి. సంపద సృష్టించడానికి బెస్ట్. వీటి లక్ష్యం మార్కెట్లో ఉన్న కంపెనీల షేర్ల విలువ పెరుగుదల ద్వారా లాభాలను అందించడం. ఇది అధిక రిస్క్ ఉన్నా, ఎక్కువ లాభాల అవకాశాలను కలిగి ఉంటుంది.
ఈ ఫండ్ ఎవరికీ అనుకూలం?
✔ 5–10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువకాలం పెట్టుబడి పెట్టాలనుకునేవారికి
✔ ఎక్కువ లాభాలు ఆశించే వారికి
✔ కొంత రిస్క్ కూడా సహించే వారికి
రిస్క్: ఎక్కువ
Returns: ఎక్కువ (Long-termలో మంచి లాభాలు)
ఈక్విటీ ఫండ్స్ రకాలు:
- Large Cap Funds – పెద్ద కంపెనీలలో పెట్టుబడి → రిస్క్ తక్కువ
- Mid Cap Funds – మధ్యస్థ కంపెనీలు → Returns ఎక్కువ
- Small Cap Funds – చిన్న కంపెనీలు → రిస్క్ ఎక్కువ, Returns ఎక్కువ
- Multi Cap Funds – అన్ని రకాల కంపెనీలలో పెట్టుబడి
- Sectoral/Thematic Funds – IT, Pharma, Banking వంటి ఒకే రంగంలో పెట్టుబడి (రిస్క్ ఎక్కువ)
👉 ఉదాహరణ: బ్లూచిప్ ఫండ్, మిడ్ & స్మాల్ క్యాప్ ఫండ్.
2. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ -Debt Funds
ఈ ఫండ్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి చేస్తాయి. రిస్క్ తక్కువ, రిటర్న్స్ స్టేబిల్గా ఉంటాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు అవసరాలకు సరిపోతాయి. Liquid, Short-Term, Corporate Bond వంటి రకాలుంటాయి. FD కంటే ఎక్కువ liquidity ఇస్తాయి. వీటి లక్ష్యం స్థిరమైన ఆదాయాన్ని అందించడం, రిస్క్ తక్కువగా ఉండడం. ఇది సాధారణంగా భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
స్టాక్‌లలో కాకుండా
✔ ప్రభుత్వ బాండ్లు,
✔ కంపెనీ బాండ్లు,
✔ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడతాయి.
ఈ ఫండ్ ఎవరికీ అనుకూలం?
✔ చిన్న కాలం పెట్టుబడి (1 నుండి3 Years)
✔ Risk తక్కువగా ఉండాలి అనుకునేవారికి → Safe-side Investors
✔ FD కంటే కొంచెం ఎక్కువ Return కావాలనుకునేవారికి
✔ FD లాభం కంటే కొంచెం మెరుగైనది కోరుకునేవారికి”
✔సేఫ్ + కొంచెం ఎక్కువ రాబడికోరుకునేవారికి
రిస్క్: తక్కువ సేఫ్ ఆప్షన్
Returns: స్థిరమైన లాభాలు
Debt Funds రకాలు:
- లిక్విడ్ ఫండ్స్
- అల్ట్రా షార్ట్-టర్మ్ ఫండ్స్
- షార్ట్-టర్మ్ ఫండ్స్
- మీడియం వ్యవధి ఫండ్స్
- కార్పొరేట్ బాండ్ ఫండ్స్
- గిల్ట్ ఫండ్స్ (100% ప్రభుత్వ సెక్యూరిటీలు – సురక్షితమైనవి)
👉 ఉదాహరణ: Liquid Fund, Gilt Fund.
3. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ – Hybrid Funds
ఈ రకం ఫండ్స్ ఈక్విటీ మరియు డిబెంచర్ రెండింటిలోనూ పెట్టుబడి చేస్తాయి. వీటి ఉద్దేశ్యం సమతుల్య లాభాలు మరియు రిస్క్ మిడిల్, రిటర్న్స్ కూడా మిడిల్ రేంజ్లో ఉంటాయి. ఇది మధ్యస్థ స్థితిని కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలం. Equity + Debt మిక్స్‌తో పెట్టుబడి. రిస్క్ మిడియం – రిటర్న్స్ కూడా మిడియం. Aggressive/Conservative హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. కొత్త ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియో కావాలనుకునే వారికి మంచి ఆప్షన్. మార్కెట్ మార్పులను మధ్యస్థంగా మేనేజ్ చేస్తాయి.
ఈ ఫండ్స్ ఈక్విటీ మరియు Debt రెండింటిలో పెట్టుబడి పెడతాయి. అంటే రిస్క్ కూడా మితంగా ఉంటుంది.
ఈ ఫండ్ ఎవరికీ అనుకూలం?
✔ Moderate Risk – మితమైన
✔ Balanced returns – సమతుల్య రాబడి కోరేవారికి
✔ Best for Beginners – బిగినర్స్ కి బెస్ట్
రిస్క్: మధ్యస్థ
Returns: మధ్యస్థ–ఎక్కువ
Hybrid Funds రకాలు:
- అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ (ఈక్విటీ ఎక్కువ)
- కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ (Debt ఎక్కువ)
- బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ (మార్కెట్ పరిస్థితిని బట్టి % మార్చుతారు)
- ఈక్విటీ సేవింగ్స్ ఫండ్
మీరు రిస్క్ తగ్గించుకోవాలి అనుకుంటే Index Funds గురించి తప్పక తెలుసుకోవాలి
4. ఇండెక్స్ ఫండ్స్ – Index Funds
Nifty 50, Sensex లాంటి ఇండెక్స్‌ను సూచికలపై ఆధారపడి ఉంటాయి. ఇవి మార్కెట్ సూచికలను అనుకరించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఇవి తక్కువ నిర్వహణ ఖర్చులతో కూడుకున్నవి మరియు మార్కెట్ పనితీరును ప్రతిబింబిస్తాయి. రిస్క్ మిడియం – లాంగ్ టర్మ్‌కి స్టేబిల్ రిటర్న్స్. Beginnersకి బెస్ట్ ఆప్షన్. ఫండ్ మేనేజర్ ప్రభావం తక్కువగా ఉంటుంది. చార్జీలు (Expense Ratio) చాలా తక్కువ. రిస్క్ మిడియం, లాంగ్ టర్మ్‌కు స్టేబిల్ రిటర్న్స్ ఇస్తాయి.
ఈ ఫండ్స్ మార్కెట్లోని ఒక Indexను (Nifty 50, Sensex) ఫాలో అవుతాయి.
ఫండ్ మేనేజర్ actively స్టాక్స్ select చేయరు.
అందువల్ల charges తక్కువ & returns స్థిరమైన
ఎవరికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది?
✔ పెట్టుబడి ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెడుతున్నవారికి ఇది చాలా సరైన ఎంపిక.
✔ చిన్న మొత్తాలతోనే ప్రారంభించవచ్చు
✔ రిస్క్ తక్కువగా ఉంటే బాగుంటుందని అనుకునేవారికి సరిపోతుంది
✔ నెలనెలా పెట్టుబడులతో భవిష్యత్తులో మంచి సంపద నిర్మించాలనుకునేవారికి బెస్ట్
👉 ఉదాహరణ: Nifty 50 Index Fund.
5. ELSS Funds (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్)
ELSS ఫండ్స్ ఈక్విటీ మీద ఆధారపడిన ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. వీటిలో పెట్టుబడి పెడితే Income Tax Act సెక్షన్ 80C కింద ట్యాక్స్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫండ్స్ కు 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, ఇది అందరి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లోనూ అతి తక్కువది.
ఈ ఫండ్స్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి కాబట్టి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ సేవ్ చేయడం తో పాటు భవిష్యత్తులో సంపదను నిర్మించాలనుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. చిన్న మొత్తాలతోనే పెట్టుబడి ప్రారంభించి, క్రమశిక్షణతో మంచి కార్పస్‌ను సృష్టించుకోవచ్చు.
లాక్-ఇన్: 3 సంవత్సరాలు (కనీస సమయం)
రాబడి: మంచి రాబడి (ఈక్విటీ ఆధారితం)
రిస్క్: మధ్యస్థం నుండి ఎక్కువ
👉 ఉదాహరణ: ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్.
6. లిక్విడ్ ఫండ్స్ – Liquid Funds
లిక్విడ్ ఫండ్స్ అంటే 1 రోజు నుండి 90 రోజుల వరకు అవసరాలకు (ఒక త్రైమాసికం) కాలానికి పెట్టుబడి చేసే వారికి సరిపోతాయి. రిస్క్ చాలా తక్కువ, FD కంటే మెరుగైన liquidity. ఎమర్జెన్సీ ఫండ్‌కి మంచి ఆప్షన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్యాంక్ ఖాతా కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. ఇవి అధిక లిక్విడిటీ మరియు తక్కువ రిస్క్ కలిగిన ఫండ్స్.
లిక్విడ్ ఫండ్స్ ముఖ్య ఉద్దేశం:
- అత్యంత తక్కువ రిస్క్ – బ్యాంక్ FD కంటే సేఫ్‌గా, స్టేబిల్గా ఉంటాయి.
- High Liquidity – డబ్బు ఎప్పుడైనా సులభంగా విత్‌డ్రా చేయవచ్చు.
- Short-term return – 4% నుండి 7% వరకు సాధారణంగా రాబడి.
- Emergency Fund కోసం బెస్ట్ ఆప్షన్.
- No Lock-in – ఏ రోజు అయినా పెట్టుబడి పెట్టవచ్చు/తీసుకోవచ్చు.
ఎవరికి ఉపయోగకరం?
👉 1 రోజు–3 నెలల అవసరాల కోసం డబ్బు పెట్టే వారికి
👉 ఎమర్జెన్సీ ఫండ్‌గా 1–2 నెల ఖర్చులను నిల్వచేయాలనుకునే వారికి
👉 Savings account కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ కావాలనుకునేవారికి
ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకున్న తర్వాత, మీ మిగిలిన జీతం నుండి డబ్బు పొదుపు ఎలా చేయాలో ఇక్కడ చూడండి
7. సెక్టార్ ఫండ్స్ – Sectoral Funds
ఈ ఫండ్స్ ఒక నిర్దిష్ట రంగం లేదా పరిశ్రమలో మాత్రమే పెట్టుబడి చేస్తాయి, ఉదాహరణకు టెక్నాలజీ IT, ఆరోగ్య Pharma, సంరక్షణ Defence, లేదా బ్యాంకింగ్ Banking రంగం. ఇది ప్రత్యేక రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులకు అనుకూలం. రిస్క్ చాలా ఎక్కువ, కానీ సెక్టార్ బాగా పెరిగినప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ. అనుభవం ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే సూటబుల్. డైవర్సిఫికేషన్ తక్కువ. సెక్టార్ సైకిల్‌పై ఆధారపడే ఫండ్స్.
సెక్టార్ ఫండ్స్ ముఖ్య ఉద్దేశం
- ఒకే సెక్టార్లో పెట్టుబడి చేస్తాయి (డైవర్సిఫికేషన్ చాలా తక్కువ).
- రిస్క్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఆ సెక్టార్ పెరిగితే మాత్రమే ఎక్కువ రాబడి వస్తుంది.
- సెక్టార్ బాగా పెరిగే దశలో ఉన్నప్పుడు హై రిటర్న్స్ వచ్చే అవకాశం.
- మార్కెట్ అవగాహన ఉన్న, అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు మాత్రమే సూటబుల్.
Long-term కాదు → మిడ్ టర్మ్ లో సెక్టార్ సైకిల్స్ మీద ఆధారపడుతుంది.
ఎవరికి ఉపయోగకరం?
👉 ఇప్పటికే డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉన్నవారికి
👉 ఒక నిర్దిష్ట సెక్టార్ భవిష్యత్తుపై నమ్మకం ఉన్నవారికి
👉 High risk తీసుకునే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు
8. అంతర్జాతీయ మార్కెట్ ఫండ్స్ – International Funds
అంటే భారతదేశం బయట ఉన్న దేశాల స్టాక్స్, మార్కెట్ల్లో పెట్టుబడి చేసే మ్యూచువల్ ఫండ్స్. వీటిని Foreign Funds లేదా Global Funds అని కూడా అంటారు. అంతర్జాతీయ మార్కెట్లోని కంపెనీల్లో పెట్టుబడి చేసే ఈ ఫండ్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడినవి. ఇది దేశీయ మార్కెట్ పరిమితిని దాటి మరింత విస్తృత అవకాశాలను అందిస్తుంది.
International Funds ముఖ్య ఉద్దేశం
- భారత్ కాకుండా USA, Europe, Japan, China, Emerging Markets వంటి దేశాలలో పెట్టుబడి.
- డైవర్సిఫికేషన్ పెరుగుతుంది – ఒకే దేశం రిస్క్ తగ్గుతుంది.
- కరెన్సీ మార్పులు (Dollar–Rupee) returnsను ప్రభావితం చేస్తాయి.
- రిస్క్ మిడియం–హై, కానీ long-term wealth creation కు బాగుంటాయి.
- ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో పెట్టుబడి చేసే అవకాశం (Apple, Google, Tesla, Amazon etc.).
ఎవరికి ఉపయోగకరం?
👉భారత మార్కెట్‌కు తోడు ఇతర దేశాల మార్కెట్ల వృద్ధిని కూడా పొందాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
👉 గ్లోబల్ ఎకానమీ గ్రోత్‌ను క్యాప్చర్ చేయాలనుకునే లాంగ్-టర్మ్ ఇన్వెస్టర్లు
👉 కరెన్సీ (డాలర్) ఆధారిత డైవర్సిఫైడ్ రిటర్న్స్ కోరుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది
👉 ఉదాహరణ:
- US-ఆధారిత ఫండ్ (S&P 500, నాస్డాక్ ఫండ్)
- గ్లోబల్ డైవర్సిఫైడ్ ఫండ్
- దేశ-నిర్దిష్ట ఫండ్ (జపాన్, చైనా మొదలైనవి)
- థిమాటిక్ అంతర్జాతీయ ఫండ్ (టెక్, AI, హెల్త్‌కేర్, EV)
ఈ వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, మరియు సమయ పరిమితుల ఆధారంగా సరైన ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి రకం తన స్వంత ప్రయోజనాలు మరియు ప్రమాదాలను కలిగి ఉండటం వల్ల, సరైన అవగాహనతో పాటు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమైనది.
SIP అంటే ఏమిటి? మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి సులభమైన గైడ్ చుడండి
| ఫండ్ రకం | వివరణ | రిస్క్ లెవల్ | రాబడి (Returns) | ఉదాహరణలు |
| Equity Funds (ఈక్విటీ ఫండ్స్) | స్టాక్స్‌లో పెట్టుబడి. లాంగ్ టర్మ్‌లో అధిక సంపద సృష్టించడానికి బెస్ట్. వోలాటిలిటీ ఎక్కువ కానీ గ్రోత్ కూడా ఎక్కువ. | ఎక్కువ | ఎక్కువ (లాంగ్ టర్మ్) | Large Cap, Mid Cap, Small Cap, Flexi Cap Funds |
| Debt Funds (బాండ్ ఫండ్స్) | బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి. స్థిరమైన రిటర్న్స్. షార్ట్–మిడియం టర్మ్ లక్ష్యాలకు బెటర్. | తక్కువ–మధ్యస్థ | మధ్యస్థ | Liquid Fund, Short-Term Debt, Corporate Bond Fund |
| Hybrid Funds (మిక్స్డ్ ఫండ్స్) | Equity + Debt మిక్స్‌తో పెట్టుబడి. రిస్క్ మరియు రిటర్న్స్ రెండూ మధ్యస్థ. ప్రారంభ పెట్టుబడిదారులకు సరైన ఎంపిక. | మధ్యస్థ | మధ్యస్థ | Aggressive Hybrid Fund, Conservative Hybrid Fund |
| Index Funds (ఇండెక్స్ ఫండ్స్) | Nifty 50 / Sensex లాంటి ఇండెక్స్‌ను అనుసరిస్తాయి. చార్జీలు తక్కువ. లాంగ్ టర్మ్‌లో స్థిరమైన గ్రోత్. | మధ్యస్థ | మధ్యస్థ–ఎక్కువ | Nifty 50 Index Fund, Sensex Index Fund |
| ELSS Funds (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్) | ట్యాక్స్ సేవింగ్ ఫండ్. 3 ఏళ్ల లాక్-ఇన్. Equity-based కాబట్టి లాంగ్ టర్మ్ రిటర్న్స్ మంచి అవకాశం. | ఎక్కువ | ఎక్కువ | ELSS మొదలైనవి |
| Liquid Funds (లిక్విడ్ ఫండ్స్) | 1–90 రోజుల చాలా తక్కువ రిస్క్ పెట్టుబడి. Emergency Fund కోసం బెస్ట్. డబ్బు ఎప్పుడైనా విత్‌డ్రా చేయవచ్చు. | చాలా తక్కువ | తక్కువ–మధ్యస్థ | Liquid Fund, Overnight Fund |
| Sectoral Funds (సెక్టార్ ఫండ్స్) | ఒకే సెక్టార్ (IT, Pharma, Banking) లో పెట్టుబడి. డైవర్సిఫికేషన్ తక్కువ → రిస్క్ ఎక్కువ. కానీ సెక్టార్ బాగుంటే returns ఎక్కువ. | ఎక్కువ | ఎక్కువ (సెక్టార్‌పై ఆధారపడుతుంది) | IT Sector Fund, Banking Fund, Pharma Fund |
| International Funds (అంతర్జాతీయ మార్కెట్ ఫండ్స్) | USA, Europe, Japan వంటి విదేశీ మార్కెట్ల్లో పెట్టుబడి. గ్లోబల్ డైవర్సిఫికేషన్ + లాంగ్ టర్మ్ గ్రోత్. | మధ్యస్థ–ఎక్కువ | ఎక్కువ (లాంగ్ టర్మ్) | S&P 500 Fund, Global Tech Fund, Emerging Market Fund |
ముగింపు:
మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభ దశలో ఉన్న ఇన్వెస్టర్లకు మంచి పెట్టుబడి ఎంపిక. ఇవి డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వంటి ప్రయోజనాలు ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్ రకాల గురించి తెలుసుకోవడం ద్వారా మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ అప్పెటైట్కు సరిపోయే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎప్పుడూ ఫండ్ లక్ష్యం, గత పనితీరు, రిస్క్‌లను చూసి పెట్టుబడి చేయాలి. సరైన అవగాహనతో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సంపద పెంచుకోవచ్చు.
ప్రశ్నలు – సమాధానాలు (FAQs)
1. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ అనేది అనేక మంది ఇన్వెస్టర్ల డబ్బును కలిపి, స్టాక్స్, బాండ్స్, ఇతర ఆస్తుల్లో పెట్టుబడి చేసే పెట్టుబడి సాధనం.
2. మ్యూచువల్ ఫండ్ ఎలా పని చేస్తుంది?
ఫండ్ మేనేజర్ ఇన్వెస్టర్ల డబ్బును సేకరించి, ఫండ్ లక్ష్యానికి అనుగుణంగా వివిధ ఆస్తుల్లో పెట్టుబడి చేస్తారు.
3. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేయడానికి ఎంత డబ్బు కావాలి?
మీరు రూ.100 లేదా రూ.500 వంటి తక్కువ మొత్తాలతో కూడా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి ప్రారంభించవచ్చు.
4. మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ ఉందా?
అవును, మార్కెట్ రిస్క్ ఉంటుంది. మీ రిస్క్ అప్పెటైట్కు అనుగుణంగా సరైన ఫండ్‌ను ఎంచుకోవాలి.
5. SIP అంటే ఏమిటి?
SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) అనేది ప్రతి నెల లేదా త్రైమాసికంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టే విధానం.
6. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేయడం సురక్షితమా?
మ్యూచువల్ ఫండ్స్ SEBI ద్వారా నియంత్రించబడతాయి. అయినా మార్కెట్ రిస్క్ ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఇవి పూర్తిగా సురక్షితం కావు. సరైన ఫండ్ ఎంపికతో రిస్క్‌ను తగ్గించవచ్చు.
Health Insurance Complete Guide for Beginner – హెల్త్ ఇన్సూరెన్స్ పూర్తి వివరా తెలుసుకోండి
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? – Complete Guide
Disclaimer: Investments are subject to market risks. This content is for educational purposes only.

