ఈ రోజుల్లో చాలా మంది భవిష్యత్తు కోసం డబ్బు పెంచుకోవాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, FD, RD లాంటి మార్గాలను ప్రయత్నిస్తున్నారు. SIP vs SWP: SIP (Systematic Investment Plan) మరియు SWP (Systematic Withdrawal Plan) అనే రెండు పద్ధతులు కూడా మీరు ఇప్పటికే విన్నవారై ఉండవచ్చు. SIP ద్వారా మనం రెగ్యులర్ గా డబ్బు పెట్టి పెంచుకోవచ్చు. SWP ద్వారా మనం పెట్టిన డబ్బుని నెలనెలా లేదా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఆర్థిక స్వతంత్రత, క్యాష్ ఫ్లో, పొదుపు అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి. మీ అవసరానికి ఏది సరిపోతుందో, ఎప్పుడు ఎంచుకోవాలో ఈ గైడ్ లో తెలుసుకుందాం.
SIP (Systematic Investment Plan) అంటే ఏమిటి?
SIP అనేది మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బును రెగ్యులర్ గా, చిన్న మొత్తాల్లో పెట్టుబడి చేయడాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, ప్రతి నెల ₹1000 లేదా ₹5000 లాంటి ఫిక్స్ చేసిన మొత్తాన్ని పెట్టవచ్చు. ఇది డిసిప్లిన్ తో పొదుపు చేసే అలవాటు పెంచుతుంది. SIP ద్వారా మార్కెట్ టైమింగ్ గురించి ఆలోచించకుండా, లాంగ్ టర్మ్ లో డబ్బు పెరిగేలా చూడవచ్చు.
SIP యొక్క ముఖ్యమైన లక్షణాలు:
- చిన్న మొత్తంలో రెగ్యులర్ పెట్టుబడి
- మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ని బహుళీకరించడంలో సహాయం
- దీర్ఘకాలంలో అధిక రాబడుల అవకాశాలు
- భారీ మొత్తాన్ని ఒక్కసారిగా పెట్టాల్సిన అవసరం లేదు
- డిసిప్లిన్ సెవింగ్స్
SIP ఎలా పని చేస్తుంది?
SIP ద్వారా మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ప్రతి నెల లేదా వారం మీరు నిర్ణయించిన మొత్తాన్ని ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్ ఎప్పుడు పైకి లేదా కిందకి ఉన్నా, మీరు క్రమంగా ఇన్వెస్ట్ చేస్తే Rupee Cost Averaging ద్వారా ఖర్చు సగటు ప్రయోజనం పొందవచ్చు.
సిప్ (SIP) తో 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలి
SWP (Systematic Withdrawal Plan) అంటే ఏమిటి?
SWP అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బు నుండి రెగ్యులర్ గా డబ్బు తీసుకునే ప్లాన్. మీరు ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి చేసిన తర్వాత, ఆ మొత్తాన్ని నెలనెలా, త్రైమాసికంగా లేదా మీ అవసరానికి అనుగుణంగా తీసుకోవచ్చు.
SWP యొక్క ముఖ్యమైన లక్షణాలు:
- రెగ్యులర్ క్యాష్ ఫ్లో
- మీ అవసరానికి తగినంత డబ్బు తీసుకోవచ్చు
- మిగిలిన ఇన్వెస్ట్ మెంట్ మీద ఇంకా రిటర్న్స్ వస్తూ ఉంటాయి
- రిటైర్డ్ పర్సన్స్ కి లేదా రెగ్యులర్ ఆదాయం కావాలనుకునేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది
SWP ఎలా పని చేస్తుంది?
మీరు ఒక పెద్ద మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన తర్వాత, ప్రతి నెల మీరు ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని తీసుకోవచ్చు. మిగిలిన డబ్బు స్కీమ్ లోనే ఉండి, ఇంకా రిటర్న్స్ ఇస్తుంది.
మీరు మీ 30, 40 ఏళ్ల వయసులో ఉద్యోగం మానేయాలనుకుంటే, ఈ విషయం మీరు తెలుసుకోవాలి.
SIP vs SWP: తేడాలు మరియు ఉపయోగాలు
| ఫీచర్ | SIP (పెట్టుబడి) | SWP (విత్‌డ్రావల్) |
| ఉద్దేశ్యం | డబ్బు పెంచుకోవడం (Wealth Creation) | రెగ్యులర్ ఆదాయం పొందడం (Regular Income) |
| ప్రారంభం | ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు | సాధారణంగా మంచి corpus build అయిన తర్వాత |
| డబ్బు ప్రవాహం | బయట నుండి ఫండ్‌లోకి డబ్బు వెళ్తుంది | ఫండ్ నుండి మీ బ్యాంక్‌కి డబ్బు వస్తుంది |
| ఎవరికీ బాగా ఉపయోగం | వర్కింగ్ ప్రొఫెషనల్స్, యువత, కొత్త పెట్టుబడిదారులు | రిటైర్డ్ వ్యక్తులు, నెలనెలా ఆదాయం అవసరమైన వారు |
| ప్రధాన ఉపయోగం | దీర్ఘకాల సంపద సృష్టి | రిటైర్మెంట్ లేదా passive income |
| మార్కెట్ ప్రభావం | మార్కెట్ పడితే units ఎక్కువ వస్తాయి | మార్కెట్ పరిస్థితులపై corpus ప్రభావితం అవుతుంది |
| రిస్క్ లెవల్ | మార్కెట్ రిస్క్ ఉంటుంది | మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీరు డబ్బు విత్ డ్రా చేస్తే అసలు వేగంగా తగ్గిపోతుంది |
| క్యాష్ ఫ్లో | పెట్టుబడి మాత్రమే | నెలనెలా ఆదాయం పొందవచ్చు |
| ట్యాక్స్ | STCG / LTCG వర్తిస్తాయి | ప్రతి withdrawal పై capital gains taxation వర్తించవచ్చు |
| Flexibility | SIP amount పెంచొచ్చు/తగ్గించొచ్చు | Withdrawal amount మార్చుకోవచ్చు |
| Ideal For | Future goals, పిల్లల చదువు, retirement corpus | Retirement income, pension alternative |
| ప్రధాన లక్ష్యం | Compounding ద్వారా wealth build చేయడం | Existing wealth ని income గా మార్చడం |
SIP ఎప్పుడు ఎంచుకోవాలి?
- మీరు ఇంకా ఉద్యోగంలో ఉన్నా, రెగ్యులర్ ఆదాయం వస్తున్నా
- లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ (చైల్డ్ ఎడ్యుకేషన్, హౌస్, పెళ్లి, రిటైర్మెంట్)
- మార్కెట్ టైమింగ్ టెన్షన్ లేకుండా, డిసిప్లిన్ తో పొదుపు చేయాలి అనుకుంటే
- చిన్న మొత్తాలతో మొదలు పెట్టి, నెమ్మదిగా & స్థిరంగా డబ్బు పెంచుకోవాలనుకుంటే
ఉదాహరణ:
రామ్ నెలకు ₹5000 SIP ద్వారా 20 ఏళ్లు పెట్టుబడి చేస్తే, సగటు 12% రిటర్న్స్ అయితే, అతను చివరికి దాదాపు ₹49–50 లక్షల వరకు చేరుకోవచ్చు.
₹5,000 SIP యొక్క Compounding Power (20 Years Example)
| వివరాలు | మొత్తం |
| ప్రతి నెల SIP | ₹5,000 |
| సగటు రాబడి (Average Return) | 12% |
| పెట్టుబడి కాలం | 20 సంవత్సరాలు |
| మొత్తం మీరు పెట్టిన డబ్బు | ₹12,00,000 |
| అంచనా ఫండ్ విలువ | ₹50,00,000 |
| సంపాదించిన లాభం | ₹37,96,000+ |
ఇది ఎలా సాధ్యపడింది?
మొదట మీరు పెట్టిన మొత్తం:
- నెలకు ₹5,000 మాత్రమే
- 20 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి ₹12 లక్షలు అవుతుంది
కానీ compounding వల్ల ఏమైంది అంటే:
- మీ డబ్బుపై వచ్చిన లాభం
- మళ్లీ పెట్టుబడిగా మారింది
- ఆ లాభంపైనా మళ్లీ లాభం వచ్చింది
అందుకే చివరికి ఇలా జరిగింది:
₹12 లక్షల పెట్టుబడి, కంపౌండింగ్ వల్ల దాదాపు ₹49 లక్షలకు పెరిగింది
Disclaimer:ఈ కాలిక్యులేషన్స్ అంచనా మాత్రమే
SWP ఎప్పుడు ఎంచుకోవాలి?
- మీరు ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేశారో, లేదా రిటైర్మెంట్ corpus వచ్చిందో
- రెగ్యులర్ ఆదాయం కావాలి (పెన్షన్ తరహాలో)
- మీ ఇన్వెస్ట్ మెంట్ మీద ఇంకా మంచి రిటర్న్స్ రావాలని
- అనుకున్న గోల్స్ కోసం నెలనెలా డబ్బు కావాలి
ఉదాహరణ:
శ్రీదేవి రిటైర్ అయిన తర్వాత ₹20 లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టింది. ఆమె SWP ద్వారా ప్రతి నెల ₹15,000 విత్ డ్రా చేసుకుంటూ, మిగిలిన డబ్బు మీద ఇంకా రిటర్న్స్ 20 సంవత్సరాల తర్వాత దాదాపు 55 లక్షల సంపాదించుకుంటుంది.
₹20 లక్షల పెట్టుబడిపై SWP ఉదాహరణ
| వివరాలు | మొత్తం |
| ప్రారంభ పెట్టుబడి | ₹20,00,000 |
| SWP (నెలనెలా విత్‌డ్రా) | ₹15,000 |
| సంవత్సరానికి విత్‌డ్రా | ₹1,80,000 |
| అంచనా సగటు రాబడి | 10%–12% |
| ఆదాయం పొందే కాలం | 15–20 సంవత్సరాలు |
| మొత్తం పొందే ఆదాయం | ₹32 లక్షలు – ₹36 లక్షలు+ |
| మిగిలే corpus అవకాశం | ₹50 లక్షలు – ₹55 లక్షలు+* |
* మార్కెట్ రాబడులపై ఆధారపడి corpus మారవచ్చు
Disclaimer: ఈ కాలిక్యులేషన్స్ అంచనా మాత్రమే
SIP & SWP: కలిపితే ఎలా ఉంటుంది?

చాలామంది మొదట కొన్ని సంవత్సరాలు SIP ద్వారా డబ్బు పెంపు సాధించి, ఆ తర్వాత SWP ద్వారా అదే corpus నుండి నెలనెలా ఆదాయం పొందుతారు. ఇది ఒక ఆర్థిక చక్రంలా పనిచేస్తుంది. మొదట పెట్టుబడి చేసి పెంపు సాధించాలి, ఆ తర్వాత అదే డబ్బుని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు.
SIP vs SWP – ట్యాక్స్ విషయాలు
SIP లో:
- లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఒక సంవత్సరం పైగా ఉంటే, 12.5% ట్యాక్స్ applicable) ₹1.25 లక్షల వరకు LTCG పై పన్ను మినహాయింపు
- షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఒక సంవత్సరం లోపు డబ్బు తీసుకుంటే, 20% ట్యాక్స్)
- రెండూ మార్కెట్ లాభాల మీద ఆధారపడి ఉంటాయి
SWP లో:
- మీరు విత్ డ్రా చేసే ప్రతి త్రాన్సాక్షన్ పై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది
- మొదట మీరు అసలు (Principal) తీసుకున్నప్పుడు పన్ను ఉండదు, కానీ లాభం (Gains) తీసుకున్నప్పుడు పన్ను వర్తిస్తుంది
- ELSS లాంటి ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అయితే, లాకిన్ పీరియడ్ ఉంటుంది
SIP మరియు SWP: ఎవరికి ఏది మంచిది?
- యువత/వర్కింగ్ ప్రొఫెషనల్స్: SIP బెటర్. డబ్బు పెరుగుదల కోసం, డిసిప్లిన్ సెవింగ్స్ కోసం.
- రిటైర్డ్ పర్సన్స్: SWP బెటర్. రెగ్యులర్ ఆదాయం కోసం, డబ్బు సేఫ్ గా ఉండేందుకు.
- గోల్స్ ఉన్నవారు (పిల్లల పెళ్లి, హౌస్, ట్రావెల్): SIP మొదలు పెట్టి, ఆ గోల్స్ రాగానే SWP కి మారొచ్చు.
SIP & SWP – ప్లానింగ్ లో తప్పులు ఏవీ?
- SIP ద్వారా పెట్టుబడి చేయకుండా నేరుగా పెద్ద మొత్తము పెట్టడం
- SWP ప్లాన్ చేయకుండానే డబ్బు మార్కెట్ నుండి తీసివేయడం
- ట్యాక్స్ అనాలిసిస్ చేయకపోవడం
- ఫండ్ సెలక్షన్ లో సరైన పరిశీలన చేయకపోవడం
SIP vs SWP: Common Questions
1. SIP ద్వారా పెట్టిన డబ్బుని ఎప్పుడు విత్ డ్రా చేయొచ్చు?
మీరు ఎప్పుడైనా రీడీమ్ చేయొచ్చు (లాకిన్ పీరియడ్ లేని ఫండ్స్ అయితే)
2. SWP లో ప్రిన్సిపల్ డబ్బు తగ్గిపోతుందా?
- మీరు ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేస్తే, ప్రిన్సిపల్ తక్కువ అవుతుంది. కనుక, అవసరానికి తగ్గట్టుగా మాత్రమే తీసుకోండి.
3. SIP మరియు FD: ఏది బెటర్?
- SIP లాంగ్ టర్మ్ లో ఎక్విటీ మార్కెట్ ద్వారా ఎక్కువ returns ఇవ్వొచ్చు. FD లో returns తక్కువ, కాని సేఫ్.
4. SWP లో కూడా నష్టాలు వస్తాయా?
- మార్కెట్ డౌన్ అయితే, SWP లోకి వచ్చే రిటర్న్స్ తక్కువగా ఉండొచ్చు. కానీ, lump sum ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి ఫండ్స్ ఎంచుకుంటే, లాంగ్ టర్మ్ లో రిస్క్ తగ్గుతుంది.
SIP మరియు SWP – చివరి మాట
- వయసు, లక్ష్యాలు, ఆదాయ అవసరాన్ని బట్టి మీకు SIP లేదా SWP ఎంచుకోవచ్చు.
- SIP – డబ్బు పెరుగుదల, భవిష్యత్ గోల్స్ కోసం.
- SWP – రెగ్యులర్ ఆదాయం, పర్సనల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం.
- SIP మరియు SWP రెండింటినీ సమర్థవంతంగా ఉపయోగిస్తే, మీ ఫైనాన్షియల్ ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది.
ప్రాక్టికల్ స్టెప్స్ (Action Plan)
- మీ ఆర్థిక లక్ష్యాలు మరియు అవసరాలను స్పష్టంగా నిర్ణయించుకోండి.
- SIP ద్వారా చిన్న మొత్తంతో మొదలు పెట్టండి
- మీ పెట్టుబడులను సమీక్షించండి. అవసరమైతే SIP మొత్తాన్ని పెంచండి.
- Corpus ఏర్పడిన తర్వాత, SWP ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని ప్లాన్ చేయండి.
- ఫండ్స్ ఎంపికలో నిపుణుల సలహా తీసుకోండి.
- ట్యాక్స్ లాభాలు మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోండి.
- మార్కెట్ వాల్యుయేషన్ లేదా టైమింగ్ పై అధికంగా ఆధారపడకండి.
ముగింపు
SIP మరియు SWP రెండూ డబ్బును స్మార్ట్ గా ప్లాన్ చేసుకునే మార్గాలు. ఒక్కో దానికి వేరు వేరు ప్రయోజనాలు, పరిమితులు ఉంటాయి. మీ ఫైనాన్షియల్ లక్ష్యాలు, వయసు, ఆదాయాన్ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకుని, డిసిప్లిన్ తో ముందుకు సాగండి. డబ్బు పెంపు కావాలా లేదా నెలనెలా ఆదాయమా? మీ అవసరాన్ని బట్టి SIP లేదా SWP ని ఎంచుకోండి. మీ ఫైనాన్షియల్ ప్రయాణంలో ముందుకు సాగండి!
పైసా మార్గం మార్గదర్శకత్వంతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.

