SIP అంటే ఏమిటి: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా, సాధారణంగా నెలవారీగా పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం. పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టే బదులు, క్రమానుగతంగా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడానికి ఇది సహాయపడుతుంది.

SIP అంటే (Systematic Investment Plan) ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం ను Mutual Fund లో పెట్టే పెట్టుబడి విధానం. ఇది ప్రారంభకులకు సురక్షితంగా, సులభంగా సంపద సృష్టించడానికి సహాయపడుతుంది.

ఈ రోజుల్లో ఎక్కువ మంది Mutual Funds ద్వారా సంపదను పెంచుకుంటున్నారు. అందులో కూడా అత్యంత పాపులర్ పద్ధతి SIP (Systematic Investment Plan)

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి – What are Mutual Funds

SIP‌లో మీరు ప్రతి నెలా కొంచెం కొంచెంగా పెట్టుబడి పెడతారు. ఈ చిన్న మొత్తాలు క్రమంగా పెట్టడం వల్ల compound interest పని చేస్తుంది. కాలక్రమేణా మీ చిన్న పొదుపు పెద్ద సంపదగా మారుతుంది.

SIP అంటే ఏమిటి – క్రమశిక్షణతో పెట్టుబడి (Disciplined investment with SIP)

SIP ద్వారా మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తం క్రమంగా పెట్టుబడి పెడతారు. ఇలా నిరంతరం పెట్టడం వల్ల మార్కెట్ ఎత్తుపల్లాలు సగటు NAV (Average) అవుతాయి, లాంగ్ టర్మ్‌లో పెద్ద సంపదగా మారుతుంది.

సంపదను నిర్మించడం – Building wealth through SIP

SIPలో ప్రతి నెల ఒకే తేదీన ఒకే మొత్తాన్ని పెట్టడం వల్ల పెట్టుబడిలో క్రమశిక్షణ పెరిగి, దీర్ఘకాలంలో మార్కెట్ ఎత్తుపల్లాలు సర్దుబాటు అవుతూ స్థిరంగా సంపద పెరుగుతుంది.

ఈ ఆర్టికల్‌లో మీరు SIP గురించి A నుంచి Z వరకు పూర్తిగా తెలుసుకుంటారు.  

SIP అంటే ఏమిటి – సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (Systematic Investment Plan).

 ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా, నెలవారీగా లేదా త్రైమాసికంలో ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇది మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నప్పుడు ఎక్కువాయూనిట్లను, మార్కెట్ పుంజుకున్నప్పుడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేసేలా చేస్తుంది, ఈ ప్రక్రియను “రూపాయి కాస్ట్ యావరేజింగ్” అంటారు. 

రూపాయి కాస్ట్ యావరేజింగ్: 

మార్కెట్ విలువ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ NAV మీ పెట్టుబడికి ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, మీ పెట్టుబడికి తక్కువ యూనిట్లు లభిస్తాయి. ఇది దీర్ఘకాలంలో సగటు కొనుగోలు ధరను తగ్గిస్తుంది. 

(NAV – Net Asset Value ఇది ఒక్కో యూనిట్ విలువను సూచిస్తుంది).

కాంపౌండింగ్: 

మీరు సంపాదించిన రాబడిపై కూడా రాబడి వస్తుంది, దీనినే కాంపౌండింగ్ అంటారు. ఇది కాలక్రమేణా మీ పెట్టుబడిని పెంచుకోవడంలో సహాయపడుతుంది. 

వడ్డీ:

 దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడం ద్వారా, మీరు మీ పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. ఈ ప్రక్రియను క్రమశిక్షణతో కొనసాగించడం చాలా ముఖ్యం  

నియమిత పెట్టుబడి: 

మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకుని, ప్రతి నెలా ₹500,1000 లేదా మీ సౌలభ్యం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని అందులో జమ చేస్తారు. అంటే, మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తంని Mutual Fund లో ఆటోమేటిక్‌గా SIPలో పెట్టుతారు. 

✔ మీ బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ అవతుంధి
✔ మీ పెట్టుబడి నెలకు ఒకసారి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది 
✔ Market లో ఉన్న ups/downs NAV average అవుతాయి 

ఈ విధంగా చిన్న మొత్తాలు కూడా పెద్ద సంపదగా మారతాయి. 

SIP ద్వారా ప్రతి నెల చిన్న మొత్తాన్ని క్రమంగా పెట్టుబడి పెట్టడం వల్ల, మీ డబ్బు మార్కెట్‌లో నిరంతరం పనిచేస్తుంది. అలాగే Rupee cost averaging, compounding, discipline investing అనే మూడు ముఖ్యమైన ప్రయోజనాలు కలిసి మీ పెట్టుబడిని పెద్దదిగా మారుస్తాయి. మార్కెట్ పెరిగిన, పడిపోయినా—మీరు ప్రతి నెలా ఒకే రోజు, ఒకే మొత్తాన్ని పెట్టడం వల్ల సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. కాలక్రమేణా ఈ చిన్న పెట్టుబడులు units రూపంలో చేరుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మార్కెట్ పెరిగినప్పుడు ఈ units విలువ పెరగడం వలన మీరు పెట్టిన మొత్తం కంటే చాలా రెట్లు ఎక్కువ Returns వస్తాయి. ఈ Entire process వల్ల, ఒక్కో నెలలో ₹500–₹1000 వంటి చిన్న Contributions కూడా 10–15 ఏళ్లలో లక్షల రూపాయల సంపదను సృష్టించగలవు. అంటే—సమయం + క్రమశిక్షణ + Compounding = పెద్ద సంపద (Big wealth create).

ప్యాసివ్ ఆదాయాన్ని ఎలా నిర్మించాలి? ఈ ఆర్టికల్ చదివి నేర్చుకోండి

SIP అంటే ఏమిటి ఎలా పనిచేస్తుంది? (How SIP Works) 

1. మీ నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించండి. (Investment Amount) 

ఉదాహరణకు నెలకు ₹1,000 SIP. 

2. Market లోని NAV ఆధారంగా Units మీకు వస్తాయి 

NAV తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు 
NAV ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు 
(ఇదే రీతి “Rupee Cost Averaging”) 

3. మీరు పెడుతున్న డబ్బు Compounding ద్వారా పెరుగుతుంది 

Compounding = డబ్బు డబ్బును సంపాదించడం. 

4. దీర్ఘకాలంలో Returns ఎక్కువ వస్తాయి 

SIP స్వల్పకాలిక పెట్టుబడి కోసం కాదు — 5+ సంవత్సరాలు కనీసం, 10–15 సంవత్సరాలు అనువైనది. SIP is not for short term investment — 5+ years Minimum, 10–15 years ideal. 

SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ యొక్క అద్భుత ప్రయోజనాలు (Benefits of SIP) 

✔ 1. చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు 

₹100, ₹500 నుండి SIP మొదలుపెట్టవచ్చు. 

✔ 2. మార్కెట్ గురించి ఎక్కువ అవగాహన అవసరం లేదు 

✔ 3. Rupee Cost Averaging 

 4. Compounding వల్ల భారీ returns 

✔ 5. Discipline & Consistency Develop – క్రమశిక్షణ మరియు స్థిరత్వం అభివృద్ధి అవుతుంది

 6. లాంగ్ టర్మ్ గోళ్స్ కి బెస్ట్ 

  • పిల్లల ఎడ్యుకేషన్ 
  • హౌస్ ప్లాన్ 
  • రిటైర్మెంట్ 
  • కార్/టూర్ వంటి లక్ష్యాలు

SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఎంత సంపాదించవచ్చు? (Real Example) 

ఉదాహరణ 1: 

మీరే ప్రతి నెల ₹3,000 SIP 15 ఏళ్లు చేస్తే, 
Assuming 12% return: 

➡ మీ మొత్తం పెట్టుబడి: ₹5,40,000 
➡ మొత్తం corpus: ₹11.34 Lakhs (డబుల్ కంటే ఎక్కువ!) 

Monthly SIP5 Years10 Years20 Years
₹1,000₹85,000₹2,30,000₹10,00,000+
₹2,000₹1,70,000₹4,60,000₹20,00,000+
SIP అంటే ఏమిటి

చార్ట్ కాంపౌండింగ్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది – ఎక్కువ వ్యవధులు రాబడిని గణనీయంగా పెంచుతాయి.

ఉదాహరణ 2: 

₹5,000 SIP 20 ఏళ్లు చేస్తే: 

➡ మొత్తం పెట్టుబడి: ₹12,00,000 
➡ Final Value: ₹49 Lakhs+ 

పెట్టుబడి చేయడానికి Best Mutual Fund Types (Beginners కోసం) 

1. Index Funds (Safest + Best for Beginners) 
  • Nifty 50 Index Fund 
  • Sensex Index Fund 
2. Large Cap Funds 

లాంగ్-టర్మ ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌ను తగ్గిస్తుంది.

3. Hybrid Funds 

డెట్ + ఈక్విటీ కలిపిన హైబ్రిడ్ ఫండ్స్ → కొత్త పెట్టుబడిదారులకు మరింత సురక్షితం. Debt + Equity → Safe for new investors. 

SIP పెట్టుబడికి నమ్మదగిన ప్లాట్‌ఫారమ్‌లు ఏమిటి? (Reliable Platforms) 

ప్లాట్‌ఫారమ్ఫీచర్స్ప్రోస్కాన్స్
Growసులభమైన యాప్, ₹100 నుండి SIP ప్రారంభం, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్యూజర్ ఫ్రెండ్లీ, కమిషన్ లేదుకస్టమర్ సపోర్ట్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది
Zerodha Coinడైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ లేదు, Zerodha అకౌంట్ అవసరంట్రేడింగ్ + ఇన్వెస్టింగ్ ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకొత్త యూజర్లకు UI కొంచెం కాంప్లెక్స్
Kuveraగోల్-బేస్డ్ ఇన్వెస్టింగ్, ట్యాక్స్ ప్లానింగ్ టూల్స్, కమిషన్ లేదుట్యాక్స్ సేవింగ్ ఫీచర్స్, సులభమైన UISIP ఆటోపే సెటప్ కొంచెం టైమ్ తీసుకుంటుంది
Paytm Moneyమ్యూచువల్ ఫండ్స్ + స్టాక్స్, పేపర్‌లెస్ ఆన్‌బోర్డింగ్సులభమైన రిజిస్ట్రేషన్, UPI ఆటోపే సపోర్ట్యాప్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ లేవు
Upstox₹0 బ్రోకరేజ్, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌తో ఇంటిగ్రేటెడ్ట్రేడింగ్ + SIP ఒకే యాప్‌లోSIP ఫీచర్స్ Groww కంటే తక్కువ
myCAMSడైరెక్ట్ AMC యాక్సెస్, సురక్షితమైన & పేపర్‌లెస్ ఇన్వెస్టింగ్AMC నుండి డైరెక్ట్ ఇన్వెస్టింగ్, సేఫ్UI కొంచెం పాతది, కొత్త యూజర్లకు కష్టంగా ఉంటుంది

ఎప్పుడూ SEBI-registered platforms మాత్రమే ఉపయోగించండి. Direct Mutual Funds ఎంచుకుంటే commission charges తగ్గుతాయి. UPI Autopay ద్వారా SIP payments సులభంగా చేయవచ్చు.

SIP ప్రారంభించే దశలవారీ మార్గదర్శకం – Step-by-Step Guide 

PAN + Aadhaar లింక్ చేయండి
(పెట్టుబడి కోసం తప్పనిసరి)

KYC పూర్తి చేయండి
(ఆన్‌లైన్‌లో e-KYC లేదా వీడియో KYC ద్వారా)

ఫండ్ ఎంచుకోండి
(మీ లక్ష్యం & రిస్క్ ఆధారంగా – Equity, Debt, Hybrid)

నెలవారీ మొత్తం నిర్ణయించండి
(₹500 లేదా ₹1000 నుండి ప్రారంభించవచ్చు)

Auto-Debit ఎనేబుల్ చేయండి
(UPI Autopay లేదా Net Banking ద్వారా)

కనీసం 5–10 సంవత్సరాలు కొనసాగించండి
(దీర్ఘకాలం పెట్టుబడి చేస్తే కాంపౌండింగ్ ప్రభావం ఎక్కువ)

Step 1: PAN + Aadhaar link 

SIP vs Lumpsum – పెట్టుబడికి ఉత్తమ మార్గం ఏది

Feature SIP Lumpsum 
Entry Time ఎప్పుడైనా Market low అయితే మంచిది 
Risk తక్కువ ఎక్కువ 
Suitable for Monthly earners One-time amount ఉన్నవారికి 
Returns Steady Volatile 

SIP మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి ఎందుకు అనుకూలం

కొత్తగా పెట్టుబడి ప్రారంభించే వారికి SIP చాలా సరైన మార్గం. ఎందుకంటే ప్రతి నెల చిన్న మొత్తాలతో పెట్టడం వల్ల discipline వస్తుంది, market ups & downs ను average చేయవచ్చు, long-termలో returns స్థిరంగా పెరుగుతాయి. చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించడానికి, రిస్క్ తగ్గించడానికి SIP మంచి ఆప్షన్. మార్కెట్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రతి నెలా క్రమంగా పెట్టుబడి చేయగల రీతిలో SIP పనిచేస్తుంది.

SIP గురించి సాధారణ ప్రశ్నలు (FAQ) 

Q1: SIP లో నష్టం వస్తుందా? 

Short term లో అవుతుంది. 
Long term (5–10 years) లో chances చాలా తక్కువ. 

Q2: SIP stop చేస్తే ఏమవుతుంది? 

మీ units అలాగే continue అవుతాయి. 
Markets grow అయితే value కూడా పెరుగుతుంది. 

Q3:  ఫండ్ select చేయాలి? 

Beginners → Nifty 50 Index Fund 

Q4: SIP లో penalty ఉందా? 

లేదు. 

Conclusion 

SIP అనేది సాధారణ ఉద్యోగి నుండి పెద్ద బిజినెస్ వ్యక్తి వరకు అందరికీ సరిపోయే పెట్టుబడి విధానం. 
చిన్న మొత్తంతో మొదలుపెట్టి, consistent గా కొనసాగిస్తూ, లాంగ్‌టర్మ్‌లో మీరు లక్షలు—కోట్ల వరకు కూడా సంపాదించవచ్చు. 

“Start early. Stay invested. Create wealth.” 

Investments are subject to market risks. This content is for educational purposes only.

Disclaimer: Investments are subject to market risks. This content is for educational purposes only.

author avatar
GIRIBABU Founder & Personal Finance Writer
Giribabu is the founder of Paisa Margam, sharing simple insights on mutual funds, SIPs, insurance, and personal finance for beginners.

1 thought on “SIP అంటే ఏమిటి? Beginners కోసం Simple & Complete Guide”

Leave a Comment